ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నకిలీ సంఖ్యలతో ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారు?' - ఏపీలో కరోనా పరీక్షలు వార్తలు

కొవిడ్ పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రజలను నకిలీ సంఖ్యలతో ప్రభుత్వం మోసం చేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. కరోనా పరీక్షలకు సంబంధించి కేంద్రం విడుదల చేసిన జాబితాలో ఏపీ ప్రస్తావన ఎందుకు లేదని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాయని అన్నారు.

chandra babu
chandra babu

By

Published : Jul 30, 2020, 10:57 PM IST

పది లక్షల జనాభాకు గాను 140 మందికి పైగా రోజూ పరీక్షలు చేస్తున్న రాష్ట్రాలకు సంబంధించి కేంద్రం ప్రకటించిన జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఎందుకు లేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల్ని నకిలీ సంఖ్యలతో ప్రభుత్వం ఎందుకు మోసం చేస్తోందని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో వైద్యం అందక ఓ యువకుడు మృతి చెందిన ఘటనపై ఆయన ట్విటర్​ వేదికగా స్పందించారు.

తిరుపతి సప్తగిరి నగర్​కు చెందిన శేఖర్.. 3 రోజులుగా ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నా అతనికి సకాలంలో సరైన చికిత్స అందించలేకపోయారు. అరగంటలో బెడ్ కేటాయిస్తే తన బిడ్డ చనిపోయే వచ్చేది కాదంటూ గొల్లుమంటున్న ఆ తండ్రికి ఎవరు సమాధానం ఇస్తారు?. మనసు కలుక్కుమనే మరో దుర్ఘటన ఇది. రోజుల తరబడి పరీక్షా ఫలితాల్లో జాప్యం.. ఫోన్ చేసినా గంటల తరబడి రాని అంబులెన్స్ లు.. బెడ్స్ లేక చెట్ల కిందే రోగులు, మార్చురీలో మృతదేహాల కుప్పలు.. ఇంతకన్నా ఘోర వైఫల్యాలు ఇంకేముంటాయి?-చంద్రబాబు, తెదేపా అధినేత

ABOUT THE AUTHOR

...view details