చిన్నతనంలో చేనేత కార్మికుల కష్టాలు స్వయంగా చూసిన శ్రీనివాసరావు... ఏనాటికైనా వారి శ్రమ తగ్గించాలనే సంకల్పంతో అధునాతన ఈ-జాకార్డ్ యంత్రానికి రూపకల్పన చేశారు. రాష్ట్రంలోని కృష్ణాజిల్లా పెడనకు చెందిన శ్రీనివాసరావుది...నేత కుటుంబం. ప్రస్తుతం ఆయన వరంగల్ ఎన్ఐటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు పడుతున్న కష్టాలను స్వయంగా చూసి వారి కష్టాన్ని ఏదో విధంగా తగ్గించాలని సంకల్పించారు. యంత్రాన్ని తొక్కాల్సిన అవసరం లేకుండా... ఒక చిన్న బటన్‌తో నడిచే విధంగా అధునాతన ఈ - జాకార్డ్ యంత్రాన్ని రూపొందించారు.
ఎక్కువ డిజైన్లకు ఎక్కువ కష్టం
సాధారణంగా... జాకార్డ్ యంత్రాల్లో ఆకృతి(డిజైన్) కోసం అట్టముక్కలను ఏర్పాటు చేసుకొని కాలుతో యంత్రాన్ని తొక్కుతుంటేనే అది నడుస్తుంది. డిజైన్ కావాలంటే అట్టముక్కలు లోపల అమర్చాల్సి వచ్చేది. చీరపై రెండు మూడు రకాల డిజైన్లు వేయాలంటే ఒక్కో ఆకృతికి ఒక్కో రకమైన అట్టముక్కలను యంత్రంలో అనుసంధానించాలి. దీనివల్ల జాకార్డు చీరల తయారీ వ్యయ ప్రయాసలతో కూడుకున్నదిగా మారింది.
తక్కువ శ్రమతో వీలైనన్ని డిజైన్లు