కృష్ణా నదిపై వైకుంఠంపురం బ్యారేజీ పనులు నిలిపివేత - వైకుంఠంపురం బ్యారేజీ
కృష్ణా నదిపై వైకుంఠంపురం బ్యారేజీ పనులు నిలిపివేసింది నిర్మాణసంస్థ. ఏప్రిల్ 1కి ముందు నాటి టెండర్లపై పునఃసమీక్షకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో జగన్ ప్రభుత్వం నిర్ణయం వచ్చేవరకు పనులు పక్కనపెట్టారు.
barrage
కృష్ణానదిపై వైకుంఠపురం బ్యారేజీ పనులు నిలిపివేశారు.ఏప్రిల్1కి ముందునాటి టెండర్లపై పునఃసమీక్షకు ప్రభుత్వం ఆదేశించడంతో వైకుంఠపురం బ్యారేజీ పనులు నిలిచిపోయాయి. 10టీఎంసీల సామర్థ్యంతో రాజధాని నీటి అవసరాలకు బ్యారేజీ నిర్మాణాన్ని గత ప్రభుత్వం ప్రతిపాదించింది. 2వేల169కోట్ల రూపాయల అంచనాలతో వైకుంఠంపురం బ్యారేజీ పనులకు గత ప్రభుత్వం శంకుస్థాపన చేసింది.ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం వచ్చేవరకు నిర్మాణసంస్థ పనులను పక్కనపెట్టింది.