ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అందరికీ ఆదర్శం.. అంబేడ్కర్ జీవితం: విజయవాడ సీపీ - ద్వారకా తిరుమల రావు

దేశానికి భారత రత్న బాబాసాహెబ్ చేసిన కృషి మరువలేనిదని విజయవాడ సీపీ ద్వారకా తిరుమల రావు అన్నారు. అన్ని వర్గాల సమన్యాయం జరిగేలా రాజ్యాంగం ద్వారా కృషి చేశారన్నారు.

అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి విజయవాడ సీపీ నివాళులర్పించారు.

By

Published : Apr 14, 2019, 3:24 PM IST

అంబేడ్కర్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. బాబాసాహెబ్ 128వ జయంతి సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అన్ని దేశాల రాజ్యాంగాలను క్రోడీకరించి అద్భుతమైన రాజ్యాంగాన్ని దేశానికి అందించిన మహానీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాలకు సామాజిక న్యాయం అందేలా చేశారని సీపీ అభిప్రాయపడ్డారు.

అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి విజయవాడ సీపీ నివాళులర్పించారు.

ABOUT THE AUTHOR

...view details