ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తిరుమలకు భక్తులు రాకూడదనేలా వైవీ సుబ్బారెడ్డి చర్యలున్నాయి'

తిరుమలకు భక్తులు రాకూడదనే విధంగా తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చర్యలున్నాయని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య ఆరోపించారు. ఆయన తితిదే ఛైర్మన్ పగ్గాలు చేపట్టిన దగ్గర్నుంచి తిరుమల ఆలయ ప్రతిష్ఠ దెబ్బతింటోందని ఆరోపించారు.

vemuri anand surya critcises yv subbareddy
వేమూరి ఆనంద్ సూర్య, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్

By

Published : Jul 8, 2020, 5:38 PM IST

తితిదే ఛైర్మన్​గా వైవీ సుబ్బారెడ్డి వచ్చినప్పటి నుంచి తిరుమల ఆలయ ప్రతిష్ఠ దెబ్బతింటోందని.. బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య మండిపడ్డారు. ఆయన చర్యల్లో తిరుమలకు భక్తులు రాకుండా చేయాలనే ఉద్దేశం కనిపిస్తోందని విమర్శించారు.

శ్రీవారి విశిష్టతను, తిరుమల విశేష ప్రాభవాలను తెలియజేసే సప్తగిరి మాసపత్రిక బదులు పోస్టులో క్రైస్తవ పత్రికను పంపిస్తున్నారని ఆరోపించారు. చందాదారులకు క్రైస్తవ పత్రిక పంపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వైవీ సుబ్బారెడ్డి, రమణ దీక్షితులు కలిసి నాటకాలాడుతున్నారని ఆరోపించారు. స్వామివారికి భక్తులు ఇచ్చే విరాళాలు, నిధులను అన్యమత ప్రచారానికి వాడుకుంటున్నారని ఆనంద్ సూర్య ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details