కరోనా ప్రభావానికి ఉద్యాన, వాణిజ్య పంటల రైతులు కుదేలవుతున్నారు. ఊహకు అందని ఉపద్రవం చుట్టుముట్టడంతో దిక్కుతోచని పరిస్థితులో సాగుదారులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. సాగు కోసం చేసిన అప్పులు తీర్చాలంటూ రుణదాతల ఒత్తిళ్లు ఒకవైపు... పండిన పంటను ఏం చేయాలో తెలియని పరిస్థితి మరోవైపు రైతులను కుంగీదీస్తోంది. ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకుని పండిచిన పంట చేతికొచ్చే దశలో ఇలాంటి నష్టాన్ని మిగిల్చడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రామాల వారీగా స్థితిగతులను ప్రభుత్వం పరిశీలించి- తమకు ఉపశమన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
లాక్డౌన్ ఎఫెక్ట్: ఆరుగాలం పడిన కష్టం ఆవిరైపోతోంది
లాక్డౌన్ కారణంగా కూరగాయల పంటలన్నీ తోటల్లోనే పాడైపోతున్నాయి. కోసేందుకు కూలీలు లేని పరిస్థితుల్లో.. కుటుంబసభ్యులతో కలిసి పంటను కోసినా కూడా.. మార్కెట్కు తరలించేందుకు వాహనాలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.
ఆరుగాలం పడిన కష్టం ఆవిరైపోతోంది