రాజకీయ నాయకులపై కేసుల విచారణ న్యాయస్థానాల్లో త్వరితగతిన పూర్తి కానున్నందున అధికారంలో ఉన్న పెద్దల భవిష్యత్తు త్వరలో తేలనుందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. లోనా లేక బయటా అనే పజిల్‌కు త్వరలో పరిష్కారం లభించనుందని చెప్పారు. రాష్ట్ర ప్రజల అనుమానం పటాపంచలు కానున్నందున అంతా అప్రమత్తంగా దీనిని గమనించాలి అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్‌ను విమర్శిస్తూ మాజీమంత్రి బండారు సత్యనారాయణ ట్వీట్ చేశారు.
'అధికారంలో ఉన్న పెద్దల భవిష్యత్తు త్వరలో తేలనుంది'
రాజకీయ నాయకులపై కేసుల విచారణ త్వరితగతిన పూర్తికానున్న నేపథ్యంలో రాష్ట్రంలోని పెద్దల భవిష్యత్తు అతి త్వరలో తేలనుందని తేదెపా పొలిట్ బ్యయూర సభ్యుడు వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. "లోనా - బయటా" పజిల్‌కు పరిష్కారం దొరకనుందని ట్వీట్ చేశారు.
వర్ల రామయ్య
కరోనా బాధితులు కూడా ఒక నెలలో హోం క్వారంటైన్ నుంచి బయటకు వస్తున్నారు. తాడేపల్లి క్వారంటైన్లో ఉంటున్న జగన్ రెడ్డి మాత్రం నెలల తరబడి బయటకు రావట్లేదు. కేసుల భయంతో దిల్లీ పర్యటనకు మాత్రమే ఇంట్లో నుంచి కాలు బయట పెడుతున్నారు. వానొచ్చినా, వరదొచ్చినా, చివరకు సొంత పార్టీ ఎంపీ చనిపోయినా ఆ కాలు బయటకు కదల్లేదు. సీబీఐ కోర్టుకు రోజూ రమ్మంటే కళ్ల నుంచి ఇక కృష్ణ, గోదావరి వరదలేనా- బండారు సత్యనారాయణ, మాజీ మంత్రి