ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జాతీయ మహిళా కమిషన్​కు వంగలపూడి అనిత ఫిర్యాదు - తెదేపా నాయకురాలు వంగలపూడి అనిత వార్తలు

రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక మహిళలపై దాడులు పెరిగాయని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత జాతీయ మహిళా కమిషన్​కు ఫిర్యాదు చేశారు. కొన్ని ఘటనలను లేఖలో పేర్కొన్న ఆమె.. బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

Vangalapudi Anita
Vangalapudi Anita

By

Published : Jul 24, 2020, 9:31 AM IST

రాష్ట్రంలో మహిళలపై హింసాత్మక దాడులు జరుగుతున్నాయంటూ తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత జాతీయ మహిళా కమిషన్​కు ఫిర్యాదు చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మహిళా ప్రభుత్వ ఉద్యోగులపై కూడా దాడులు పెరిగిపోయాయని లేఖలో వెల్లడించారు.

'2019 అక్టోబర్​లో అధికార పార్టీ ఎమ్మెల్యే.... సరళ అనే మండల పరిషత్ డెవలప్​మెంట్ అధికారి ఇంటికి వెళ్లి దాడి చేసి బెదిరించారు. 2020 మార్చిలో చిత్తూరు జిల్లాలో స్థానిక వైకాపా నాయకులు.. డాక్టర్ అనిత రాణి అనే సివిల్ సర్జన్​ను వేధింపులకు గురి చేశారు. ఇటీవల రాజమండ్రిలో దళిత బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఇందులో నేరస్తులతో పోలీసులు కుమ్మక్కయ్యారు. తన ఇష్టానుసారమే ఇంట్లో నుంచి పారిపోయానని చెప్పాలని పోలీసులు బాలిక చేతులు విరిచి గోడకు అదిమి కొట్టి బెదిరించారు. బాలికపై 12 మంది దుశ్చర్యకు పాల్పడ్డారు. వారిలో ఇద్దరు కరోనా రోగులు కూడా ఉన్నారు. బాధితురాలైన బాలిక కూడా కొవిడ్ పాజిటివ్ అని చెబుతున్నారు. అందువల్లే ఆ బాలికను కలవడానికి, పరామర్శించడానికి ఎవరినీ అనుమతించడం లేదు. ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఈ చర్యకు పాల్పడ్డ వారిపై జాతీయ మహిళా కమిషన్ వారు కఠిన చర్యలు తీసుకోవాలి' అని లేఖలో వంగలపూడి అనిత కోరారు. ఆంధ్రప్రదేశ్​లో మహిళలపై... ముఖ్యంగా దళిత మహిళలపై జరుగుతున్న ఇటువంటి హింసాత్మక చర్యలు, అట్రాసిటీలను దృష్టిలో ఉంచుకొని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details