విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది . రైలుపట్టాల సమీపంలో ఏడు రోజుల వయసున్న గుర్తు తెలియని మగ శిశువును వదిలి వెళ్లారు. శిశువు ఏడుపు వినిపించటంతో.. సత్యనారాయణపురానికి చెందిన దంపతులు వెంటనే బాబును తీసుకొని సపర్యలు చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకొన్న పోలీసులు.. స్థానికంగా ఉన్న వైద్యుడితో వైద్య పరీక్షలు నిర్వహించి.. ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
దారుణం.. రైల్వే ట్రాక్ పక్కన ఏడు రోజుల మగ శిశువు - krishna
సమాజంలో మానవత్వం మంటగలుస్తోంది. కడుపున పుట్టిన కన్నకొడుకును సైతం రోడ్డున పడేసిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది.
మగశిశువు లభ్యం