ETV Bharat / state
మంత్రి దేవినేని ఉమాకు ఆర్యవైశ్యుల మద్దతు
రాష్ట్ర మంత్రి, మైలవరం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని ఉమాకి పట్టణ ఆర్యవైశ్య సభ్యులు మద్ధతు తెలిపారు. ఆర్యవైశ్య సభ్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని దేవినేని హామీ ఇచ్చారు.
ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న దేవినేని ఉమ
By
Published : Mar 31, 2019, 10:50 PM IST
| Updated : Mar 31, 2019, 11:28 PM IST
ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న దేవినేని ఉమ కృష్ణా జిల్లా మైలవరంలో స్థానిక కోదండ రామాలయం వద్దఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం జరిగింది. రాష్ట్ర మంత్రి, మైలవరంతెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని ఉమాకి పట్టణ ఆర్యవైశ్య సభ్యులు మద్దతు ఇస్తున్నట్లుప్రకటించారు. వ్యాపార రంగంలో ఉన్న తమకు ప్రభుత్వం నుంచి మంచి సహకారాన్ని అందించినందుకు కృతజ్ఞతతో ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు. తనకుఆత్మీయ ఆహ్వానం పలికిన ఆర్యవైశ్య సభ్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని దేవినేని హామీ ఇచ్చారు. గత పది సంవత్సరాలుగా మైలవరం ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధతో కృషి చేసిన తనను... తిరిగి గెలిపిస్తే మరింత చిత్తశుద్ధితో హామీలను నెరవేరుస్తానని దేవినేని ఉమ అన్నారు. గోదావరి జలాలను అనుసంధానం చేసేందుకు లోటు బడ్జెట్లో కూడా చంద్రబాబు నిధులు విడుదల చేశారన్నారు. ఇవి చూడండి...
Last Updated : Mar 31, 2019, 11:28 PM IST