మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం(accident) సంభవించింది. కృష్ణా జిల్లా (krishna district)పామర్రు మండలం కాపవరం వద్ద.. అతి వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఆ వేగానికి పల్టీలు కొడుతూ.. డివైడర్ దాటి అటుగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
ఎంతటి ఘోరం.. తప్పు కారు డ్రైవర్‌ది.. ప్రాణం పోయింది బైక్ పై ఉన్నవాళ్లది!
కృష్ణా జిల్లాలో(krishna district) ఘోర రోడ్డు(accident) ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి డివైడర్ దాటి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
accident
ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. మృతులు మొవ్వ మండలం కాజాకు చెందిన కామేశ్వరరెడ్డి(24), మోదుగుమూడి ఉమాకాంత్(20)గా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి