కృష్ణా జిల్లా నందిగామ మండలం నరసింహారావుపాలెంకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు ఈత కొట్టేందుకు వైరా ఏరుకు వెళ్లారు. వీరిలో ఐదుగురు ఒడ్డునే ఉండగా... గోపిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రవీంద్ర రెడ్డి ఏరులోకి దిగారు. లోతు ఎక్కువగా ఉన్న కారణంగా గల్లంతయ్యారు. ఎంతసేపటికీ బయటికి రాకపోవటంతో మిగిలినవారు స్థానికులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న గ్రామస్థులు వారిని కాపాడేందుకు నీటిలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టగా... గోపిరెడ్డి విగతజీవిగా కనిపించాడు. మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. మిగిలిన ఇద్దరి ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఏరులోకి దిగి ఒకరు మృతి... ఇద్దరు గల్లంతు - కృష్ణా జిల్లాలో ఏరులోకి దిగిన ముగ్గురులో ఒకరి మృతి, ఇద్దరు గల్లంతు'
సరదాగా ఈత కొట్టడానికి వెళ్లిన ఎనిమిది మంది విద్యార్థుల్లో ఇద్దరు గల్లంతు కాగా... ఒకరు మృతిచెందారు. ఈ విషాద ఘటన నందిగామ వైరా ఏరులో జరిగింది.
'ఏరులోకి దిగిన ముగ్గురులో ఒకరి మృతి... ఇద్దరు గల్లంతు'