ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Land Dispute: స్థల వివాదంలో ట్విస్ట్​.. తప్పంతా అల్లుడిదే అంటున్న మామ - కిష్ణా జిల్లాలో భూ వివాదం

Land Dispute: కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో స్థలం వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. గన్నవరం మాజీ ఎంపీపీ పొట్లూరి బసవరావుతో ప్రాణహాని ఉందంటూ.. తమ స్థలాన్ని కబ్జా చేశారంటూ పల్లపోతు గంగరాజు, దుర్గాకల్యాణి దంపతులు నిరసన చేపట్టారు. దీనిపై అతని కుటుంబ సభ్యులు స్పందించారు. అ స్థలాన్ని 2013లోనే అమ్మేసినట్లు తెలిపారు.

Land Dispute
స్థలం వివాదం

By

Published : Jun 29, 2023, 7:53 PM IST

kesarapalli Land Dispute: కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి స్థల వివాదం కొత్త మలుపు తిరిగింది. స్థల వివాదంలో మాజీ ఎంపీపీ పొట్లూరి బసవరావుకు ఎటువంటి సంబందం లేదని పల్లపోతు దుర్గాకల్యాణి కుటుంబీకులు అన్నారు. కుటుంబ అవసరాల దృష్ట్యా వివాదాస్పదంగా మారిన 94 గజాల స్థలాన్ని 2013లోనే బసవరావుకు విక్రయించినట్లు కుటుంబీకులు వెల్లడించారు.

ఇంతకీ ఏం జరిగిందంటే?:కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లికి చెందిన పల్లపోతు గంగరాజు, దుర్గాకల్యాణి దంపతుల ధర్నా చేశారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అనుచరుడి వల్ల తమకు ప్రాణహాని ఉందంటూ బుధవారం నిరసనకు దిగారు. ఎమ్మెల్యే వంశీ అనుచరుడు, గన్నవరం మాజీ ఎంపీపీ పొట్లూరి బసవరావు నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ ఆరోపించారు.

తాము 2017 సంవత్సరంలో 94 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశామని.. దానిని కబ్జా చేశారని తెలిపారు. తమను చంపేస్తానంటూ బెదిరిస్తున్నారంటూ విమర్శించారు. 2022వ సంవత్సరంలో నకిలీ పత్రాలు సృష్టించి.. గతకొంత కాలంగా పొట్లూరి బసవరావు దౌర్జన్యం చేస్తున్నారన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పోలీసులు పట్టించుకోవటం లేదంటూ చెప్పారు.

ఇదిలావుంటే పల్లపోతు దుర్గాకల్యాణి, ఆమె భర్త గంగరాజు చేసిన ఆరోపణలపై.. దుర్గాకల్యాణి కుటుంబ సభ్యులు స్పందించారు. కుటుంబ అవసరాల దృష్ట్యా వివాదాస్పదంగా మారిన 94 గజాల స్థలాన్ని 2013లోనే బసవరావుకు విక్రయించినట్లు కుటుంబీకులు వెల్లడించారు. వాస్తవానికి గంగరాజు దంపతులే నకిలీ పత్రాలు సృష్టించి తమ స్థలం అని గతకొంత కాలంగా బసవరావును వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పల్లపోతు గంగరాజు దంపతుల నుంచి తమకు ప్రాణహాని ఉందని దుర్గాకల్యాణి తండ్రి వీర వెంకటేశ్వరరావు, చెల్లెళ్లు నిర్మల, జ్యోశ్న తెలిపారు.

కొత్త మలుపు తిరిగిన స్థల వివాదం.. అల్లుడిదే తప్పు అంటున్న మామ

"గంగరాజు మా పెద్ద అల్లుడు. కుటుంబంలో అల్లర్లు సృష్టించాడు. మా ఆస్తిని కాజేశాడు. నేను బయట అప్పులు తీసుకొనివచ్చి.. మా పిల్లల పెళ్లి చేశాను. ఆ అప్పులు తీర్చుకోవడానికి.. 2013లో స్థలం అమ్మాను. తరువాత నా దగ్గర డాక్యుమెంట్ ఉందంటూ గంగరాజు తీసుకొనివచ్చి నన్ను అప్రతిష్ఠ పాలు చేశాడు. అతను పెద్ద దొంగ. నాడు-నేడు డబ్బులు కొల్లగొట్టుకొని.. ఇల్లు కట్టుకున్నాడు". - వెంకటేశ్వరరావు, దుర్గాకల్యాణి తండ్రి

"మేము ముగ్గురు ఆడ పిల్లలం. పెద్దమ్మాయి పల్లపోతు దుర్గాకల్యాణి, ఆవిడ భర్త పల్లపోతు గంగరాజు. నా పెళ్లికి డబ్బులు లేకపోతే నాన్న.. బయట అప్పులు తెచ్చి 2012లో నా పెళ్లి చేశారు. అప్పులు తీర్చలేక మా నాన్న కంగారు పడుతూ ఉంటే.. నేను, నాన్న, అక్క దుర్గాకల్యాణి, ఆవిడ భర్త గంగరాజు అందరం కలిసి మాట్లాడుకొని.. ఆ స్థలాన్ని అమ్మాలనుకున్నాం. బసవరావుకి స్థలం అమ్మాం". - నిర్మల, దుర్గాకల్యాణి సోదరి

ABOUT THE AUTHOR

...view details