గిరిజనుల విద్యను మరింత మెరుగుపరచే సంకల్పంతో అధికారులు పని చేయాలని గిరిజన శాఖ కార్యదర్శి ఆర్పీ సిసోడియా అధికారులకు సూచించారు. విజయవాడ గిరిజన సంక్షేమశాఖ కార్యాలయంలో రాష్ట్రస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమీక్షకు గిరిజన సంక్షేమశాఖ అధికారులు, ఐటీడీఏ పీవోలు హాజరయ్యారు. పాఠశాలలు తెరిచేలోగా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఉపాధ్యాయుల కొరత, సదుపాయల మెరుగుదల వంటి అంశాలపై చర్చించారు. హేతుబద్ధీకరణ వంటి అంశాలపై క్షేత్రస్థాయి స్థితిగతులను తెలుసుకోవాలని సూచించారు. పాఠశాలలు తెరిచేలోగా అవసరమైన సౌకర్యాలు సమకూరుస్తామని సిసోడియా వివరించారు.
'గిరిజనుల విద్యను మరింత మెరుగుపరచాలి'
గిరిజన ఆశ్రమ పాఠశాలల్లోని సమస్యలపై అధికారులు రాష్ట్రస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. పాఠశాలలు తెరిచేలోగా సౌకర్యాలు సమకూర్చాలని గిరిజన శాఖ కార్యదర్శి ఆర్పీ సిసోడియా అధికారులకు సూచించారు.
ఆర్పీ సిసోడియా