విజయవాడ నగరంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న కారణంగా... నగరపాలక సంస్థ అధికారులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నగర పరిధిలోని అన్ని ప్రాంతాల్లో మాంసం విక్రయాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. వ్యాపారులు అనధికారికంగా అమ్మకాలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. దుకాణాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. పెనమలూరు మండల వ్యాప్తంగానూ మాంసం విక్రయాలు నిషేధించినట్లు అధికారులు తెలిపారు.
నేడు మాంసం విక్రయాలు నిషేధం
కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగాలు అప్రమత్తమవుతున్నాయి. కృష్ణా జిల్లా విజయవాడ నగరంలో మాంసం విక్రయాలు నిలిపివేయాలని నగరపాలక సంస్థ ఆదేశాలు జారీ చేసింది.
నేడు మాంసం విక్రయాలు నిషేధం
Last Updated : Apr 19, 2020, 3:09 PM IST