ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడు కృష్ణా జిల్లా బందరు పార్లమెంట్ పరిధిలో చంద్రబాబు పర్యటన - మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు

తెదేపా అధినేత చంద్రబాబు నేడు కృష్ణా జిల్లా బందరు పార్లమెంట్ పరిధిలో పర్యటించనున్నారు. ఇటీవల చనిపోయిన మాజీ మంత్రి నడకుదిటి నర్సింహారావు, పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించనున్నారు.

chandrababu tour in machilipatnam
చంద్రబాబు పర్యటన

By

Published : Jul 14, 2021, 12:12 AM IST

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇవాళ కృష్ణా జిల్లా బందరు పార్లమెంట్ పరిధిలో పర్యటించనున్నారు. మచిలీపట్నంలో పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర నివాసానికి వెళ్లనున్న చంద్రబాబు.. ఇటీవల చనిపోయిన కొల్లు రవీంద్ర మామ, మాజీ మంత్రి నడకుదిటి నర్సింహారావు కటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం నాగేశ్వరరావు పేటకు అధినేత చంద్రబాబు వెళ్లనున్నారు. ఇటీవల కరోనాతో చనిపోయిన పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details