కృష్ణా జిల్లా నూజివీడు ఏరియా ఆసుపత్రిలో మూడు కాళ్లతో శిశువు జన్మించింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ధ్రువీకరించారు. మెరుగైన వైద్య సేవలకు విజయవాడ ఆసుపత్రికి తరలించినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రసింగ్ తెలిపారు.
అరుదైన ఘటన.. మూడు కాళ్లతో శిశువు జననం - మూడు కాళ్ల శిశువు వార్తలు
ఒకే కాన్పులో ముగ్గురు, నలుగురు పిల్లలు పుట్టడం చూసే ఉంటాం. కవలలు.. అతుక్కుని జన్మించటం కూడా చూశాం. ఇలాంటి అరుదైన ఘటనే కృష్ణా జిల్లా నూజివీడు ఏరియా ఆసుపత్రిలో జరిగింది. ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళకు మూడు కాళ్లతో ఉన్న బిడ్డ పుట్టింది.

మూడు కాళ్లతో జన్మించిన శిశువు