తెలంగాణలోని పాలమూరు జిల్లా పేరు చెబితే అందరికి గుర్తుకు వచ్చేది పిల్లలమర్రే. శిధిలావస్థకు చేరిన వృక్షానికి పునరుజ్జీవం కల్పించేందుకు అటవీశాఖ చేసిన అనేక ప్రయోగాల ఫలితంగా పిల్లలమర్రి కొత్త చిగుర్లు, ఊడలతో కళకళలాడుతోంది.
అదే జిల్లాలో మరో మహావృక్షం..
అదే మహబూబ్ నగర్ జిల్లాలో పిల్లలమర్రికి ఏ మాత్రం తీసుపోని మరో మహావృక్షం మాత్రం నిరాదరణకు గురై ఆనవాళ్లు కోల్పొతోంది. నవాబుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో పిల్లలమర్రి తరహాలో ఉన్న వృక్షం పాలమూరులో ఉన్న దానికంటే పెద్దదని చెబుతున్నారు. ఐదెకరాల విస్తీర్ణంలో విస్తరించిన చెట్టు వందేళ్ల నాటిదని స్థానికులు చెబుతున్నారు.
చెట్ల మధ్యలో హనుమాన్ రక్ష..
చెట్టు మధ్యలో ఉన్న వీరాంజనేయ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న మర్రి వృక్షాన్నే చెట్టు మొదలుగా భావిస్తున్నారు. మొదళ్లు శిథిలావస్థకు చేరి కూలిపోతుండగా.. మరోవైపు నుంచి వస్తున్న కొత్త ఊడలతో చెట్టు మరింత విస్తరిస్తోంది.