రెండు తెలుగురాష్ట్రాల్లో ఈ తరహాలో దాదాపు 121 చోరీలకు పాల్పడిన అంతర్‌రాష్ట్ర నేరస్థుడిని కృష్ణా జిల్లా చల్లపల్లి, సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఎస్పీ జాషువా వివరాలు వెల్లడించారు. చాట్రాయి మండలం చిత్తపూర్ గ్రామానికి చెందిన తిరువీధుల సురేంద్ర అలియాస్ సూర్య అనాథ. చోరీని వృత్తిగా చేసుకున్నాడు. తాళాలు వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలు చేస్తాడు. ఇతనిపై ప్రస్తుత ఏలూరు జిల్లా చాట్రాయి మండల పోలీసుస్టేషన్‌లో డీసీ షీట్ ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా చోట్ల చేతివాటం ప్రదర్శించాడు. గత నెల 28న చల్లపల్లి ఇస్లాంనగర్‌లో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సూర్యను అదుపులోకి తీసుకుని విచారించడంతో మరికొన్ని నేరాలు వెలుగుచూశాయి. ఒకకేసులో సూర్యను పీడీ యాక్ట్‌పై తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకోగా వరంగల్ జైలులో శిక్ష అనుభవించాడు. గతనెల 17న విడుదలైన తర్వాత 20 రోజుల వ్యవధిలో చల్లపల్లితో పాటు గుడివాడ, జంగారెడ్డిగూడెం, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, రాజానగరం, ఖమ్మంలో దొంగతనాలకు పాల్పడినట్టు నిర్ధారణ అయ్యింది.
తెలుగు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్... ఎక్కడంటే..?
శ్మశానాలే అతని ఆవాసం... అక్కడ ఉంటూ రెక్కీ నిర్వహిస్తాడు... ఎంచుకున్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడతాడు. సొత్తును శ్మశానాల్లో పాతిపెట్టి దాచేస్తాడు. ఆశ్యర్యంగా ఉంది కదా... అయితే ఈ వార్తను చదవండి. మీకూ ఓ క్లారిటీ వస్తుంది.
శ్మశానవాటికల్లో ఉంటూ చోరీ చేసే ఇళ్లను ఎంచుకుంటాడు. మద్యం తాగడం, నిద్ర, తదితరాలన్నీ అక్కడి సమాధులపైనే కొనసాగిస్తాడు. సెల్‌ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ఎప్పుడూ ఉపయోగించడు. చేతికి గ్లౌజ్ ధరించి సీసీ కెమెరాల కనెక్షన్‌లను తొలగిస్తాడు. చోరీ తర్వాత సొత్తును శ్మశానాల్లో పాతిపెట్టి అవసరం వచ్చేవరకూ భద్రపరుస్తాడు. ఖమ్మం జైలు నుంచి విడుదలయ్యాక చేసిన ఏడు చోరీల్లో దొంగిలించిన రూ.20 లక్షల విలువ చేసే బంగారు నగలు, వెండి ఆభరణాలు, బైక్, నగదులను ప్రత్యేక బృందాలు శ్మశానాల నుంచే రికవరీ చేశాయి.
ఇవీ చదవండి: