గుర్తు తెలియని వ్యక్తులు తన పంట నాశనం చేశారంటూ ఓ రైతు ఆందోళన చేసిన ఘటన ఉంగుటూరు మండలం వేంపాడులో జరిగింది. కోనేరు వీర వెంకటేశ్వరరావు తన పొలంలో వేసిన వరి పంట చేతికొచ్చే సమయంలో కొందరు గడ్డి మందు పిచికారీ చేసారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలోను ఒకసారి ఇలానే దుండగులు యత్నించినా పోలీసులను ఆశ్రయిస్తే తనకు న్యాయం జరగలేదన్నాడు.ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చిందని వాపోయాడు. సత్వరమే తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు.
పంటను ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు - News of the plight of farmers in Unguturu
ఆరుగాలం పండించిన పంట చేతికొచ్చిన సమయానికి గుర్తుతెలియని వ్యక్తులు గడ్డి మందు పిచికారీ చేశారంటూ ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా ఉంగుటూరులో జరిగింది. తనకు న్యాయం చేయాలంటూ కోరుతున్నాడు.
పంటను ధ్వసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు