ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బలహీనవర్గాలపై దాడుల విషయంలో స్పందించకపోతే ఉద్యమిస్తాం'

ముదినేపల్లి మండలం ఐనంపూడి గ్రామంలో బలహీనవర్గానికి చెందిన మహిళ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ మాజీ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య నందిగామ పట్టణ రైతుపేట తెదేపా కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు.

tdp protest
tdp protest

By

Published : Sep 5, 2020, 5:28 PM IST

ముదినేపల్లి మండలం శ్రీహరిపురం శివారు ఐనంపూడికి చెందిన నర్సింగ్ విద్యార్థిని ప్రేమించానని వెంట తిరిగి చివరికి సాయిరెడ్డి పెళ్లి చేసుకోమంటే నిరాకరించడంతోపాటు కుటుంబంతో నిద్రిస్తున్న ఆమె ఇంటికి తెల్లవారుజామున నిప్పు అంటించడం చాలా దుర్మార్గమని తంగిరాల సౌమ్య అన్నారు.

గతంలో సాయి రెడ్డి ప్రేమిస్తున్నానంటూ మహిళను వేధింపులకు గురి చేయడంతో అతనిపై కేసు నమోదు చేయడం జరిగిందని, ఈ కేసు న్యాయస్థానంలో కొనసాగుతుండగానే అధికార పార్టీకి చెందిన వైకాపా నాయకులు కేసు వెనక్కి తీసుకోవాలని.. లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు. ఊరి నుంచి బహిష్కరిస్తామని బెదిరింపులకు దిగడం వైకాపా దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అని ఆమె తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. బలహీనవర్గాలపై దాడులు, అక్రమాలు జరగకుండా రక్షణ కల్పించాలని.. అలానే వారిపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చేయాలని లేనిపక్షంలో సోమవారం నాడు 'ఛలో ఐనంపూడి' కార్యక్రమానికి ఆమె సిద్ధమని తెలియజేశారు.

ఇదీ చదవండి:సుశాంత్‌ కేసు: షౌవిక్, శామ్యూల్​కు ఐదు రోజుల రిమాండ్

ABOUT THE AUTHOR

...view details