స్థానిక సంస్థల పోరును... ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా నిర్వహించాలని తెదేపా డిమాండ్ చేసింది. మరో అవకాశం వైకాపాకు ఇస్తే రాష్ట్ర నాశనాన్ని ప్రజలు కోరుకున్నట్లేనని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. ప్రభుత్వ తీరుపై పది ప్రశ్నలతో కూడిన కరపత్రాన్ని ఆయన విజయవాడలోని పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ ప్రశ్నలకు వైకాపా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.
తెదేపా పది ప్రశ్నలు.. ప్రభుత్వ సమాధానానికి డిమాండ్ - వైకాపై మండిపడ్డ వర్ల రామయ్య
ప్రభుత్వ తీరుపై.. పది ప్రశ్నలను తెదేపా సంధించింది. ఈ ప్రశ్నలతో కూడిన కరపత్రాన్ని పార్టీ నేతలు విజయవాడలోని పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.
ప్రశ్నలతో కూడిన పాంప్లెట్ను విడుదల చేసిన తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య