ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాష్ట్రంలో కక్షపూరిత, అరాచక పాలన సాగుతోంది'

తెదేపా నేత అచ్చెన్నాయుడు అరెస్టుపై ఆ పార్టీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు స్పందించారు. రాష్ట్రంలో కక్షపూరిత, అరాచక పాలన కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

TDP MLC Bacchula Arjunudu respond on acchennaidu arrest in Vijayawada
అచ్చెన్నాయుడు అరెస్టుపై మాట్లాడుతున్న తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు

By

Published : Jun 13, 2020, 4:57 PM IST

రాష్ట్రంలో కక్షపూరిత, అరాచక పాలన జరుగుతోందని తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల అరెస్టులే ఇందుకు నిదర్శనమన్నారు. అసెంబ్లీలో అచ్చెన్నను ఎదుర్కొనే సత్తా లేకనే అక్రమంగా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడి అక్రమ అరెస్ట్​పై ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. యనమల, చినరాజప్పలపై కూడా అక్రమ కేసులు బనాయించారని, సీఎం జగన్ బెదిరింపు రాజకీయాలకు త్వరలోనే ముగింపు పలుకుతుందని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details