మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఆసుపత్రి నుంచి బలవంతంగా డిశ్ఛార్జ్ చేయడం ఒక కుట్ర అని తెదేపా ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ ఆరోపించారు. అచ్చెన్న విషయంలో వైకాపా ప్రభుత్వం రాక్షసంగా ప్రవర్తిస్తోందని విమర్శించారు. ఆయన ఆరోగ్యం బాగుంటే అంబులెన్సులో, వీల్‌ఛైర్‌లో ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. ఈ పరిణామాలన్నింటికి జగన్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
'అచ్చెన్న విషయంలో వైకాపా ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోంది'
అచ్చెన్నాయుడును ఒక్కరోజైనా జైలులో పెట్టాలనే ఉద్దేశంతోనే బలవంతంగా డిశ్ఛార్జ్ చేశారని తెదేపా ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ ఆరోపించారు. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడకపోయినా జైలుకు తరలించి రాక్షస ఆనందం పొందుతున్నారని విమర్శించారు.
అంగర రామ్మోహన్, తెదేపా ఎమ్మెల్సీ