నివర్ తుపాను కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ రూరల్ మండంలోని రాయనపాడు, పైడూరుపాడు, జక్కంపూడి గ్రామాల పరిధిలో నీట మునిగిన పంటలను ఆయన పరిశీలించారు. పంట నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. తుపాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టం జరిగిందని.., ప్రభుత్వ పంట నమోదు ప్రకారం వివరాలు సేకరించి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. కౌలు రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
రైతులను ఆదుకోవాలి
గన్నవరం నియోజకవర్గంలోని గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల్లో నీట మునిగిన వరి పొలాలను తెదేపా నేతలు సందర్శించారు. నివర్ తుపాను కారణంగా నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం సత్వరమే ఆదుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.