ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నష్టపోయిన రైతులను ఆదుకోండి..: తెదేపా

కృష్ణా జిల్లాలో తుపాను ధాటికి నష్టపోయిన పంటలను... మాజీ మంత్రి దేవినేని ఉమా పరిశీలించారు. రంగుమారిన, తడిసిన ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన ప్రతి పంటకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలని నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య డిమాండ్ చేశారు.

tdp leaders visit crop damaged areas in krishna district
'నష్టపోయిన రైతులను ఆదుకోండి':తెదేపా

By

Published : Nov 30, 2020, 4:10 PM IST

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఈలప్రోలు గ్రామంలో తుపాను కారణంగా తడిసిన ధాన్యాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించారు. తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. తుపాను ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. గ్రామాల్లో రూ.1850కి కొనుగోలు చేయాల్సిన మొక్కజొన్న... రూ.1000కే దళారులు కొనుగోలు చేస్తున్నారన్నారు.

రైతులు ఇబ్బందులు పడుతుంటే ఓదార్పు మాటలు మాట్లాడకుండా... ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి మాణిక్యాలరావు విమర్శించారు.

మద్దతు ధర కల్పించాలి: తంగిరాల సౌమ్య

రైతులు పండించిన ప్రతి పంటకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలని... నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య డిమాండ్ చేశారు. సుబాబుల రైతుల పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సుబాబుల రైతులకు టన్నుకు రూ.5 వేలు ఇవ్వాలని నిరసన చేపట్టారు. అనంతరం తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు. పంట నష్టాలను త్వరితగతిన అంచనా వేసి రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

తక్కువ ముళ్లు... ఎక్కువ రుచి... ఉప్పు నీటిలో పెరిగే అప్పలు చేప

ABOUT THE AUTHOR

...view details