ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ ప్రభుత్వం... దేవుడికి ఏదీ లేకుండా చేసేటట్టుంది: జవహర్

వైవీ సుబ్బారెడ్డి తితిదే ఛైర్మన్ అయిన తర్వాత సొంత పెత్తనంతో .. సంప్రదాయాలను తుంగలో తొక్కుతున్నారని తెదేపా నేతలు మండిపడ్డారు. అన్యమతస్తులు స్వామివారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఫామ్​లో సంతకం పెట్టే సంప్రదాయం ఎప్పటినుంచో ఉందన్నారు. ఇప్పుడు డిక్లరేషన్ ఇచ్చే పరిస్థితి లేదు అనడం పై తీవ్రంగా మండిపడ్డారు. రాబోయే రోజుల్లో సంప్రోక్షణ, బ్రహ్మోత్సవాలు, దర్శనాలు, దేవుడికి ఏదీ లేకుండా చేసే పరిస్థతి వైకాపా ప్రభుత్వంలో ఏర్పడేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

tdp leaders fire on ysrcp
tdp leaders fire on ysrcp

By

Published : Sep 20, 2020, 8:06 AM IST

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దళితులు, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని మాజీమంత్రి కొత్తపల్లి జవహర్ మండిపడ్డారు. సోనియా గాంధీ.. మత విశ్వాసాలను గౌరవిస్తానని డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే దేవాలయంలోకి ప్రవేశించారని గుర్తు చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే దేవాలయంలోకి ప్రవేశించారని.. ఇప్పుడు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి డిక్లరేషన్ ఇచ్చే పరిస్థితి లేదని అంటున్నారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో సంప్రోక్షణ, బ్రహ్మోత్సవాలు, దర్శనాలు, దేవుడికి ఏదీ లేకుండా చేసే పరిస్థతి వైకాపా ప్రభుత్వంలో ఏర్పడేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానంలో మొదటినుంచి అన్యమతస్తులు స్వామివారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఫామ్​లో సంతకం పెట్టే సంప్రదాయం ఉందని టీఎన్ఎస్ఎఫ్ జాతీయ సమన్వయ కమిటీ సభ్యులు రవి నాయుడు గుర్తుచేశారు. అయితే సుబ్బారెడ్డి తితిదే ఛైర్మన్ అయిన తర్వాత సొంత పెత్తనంతో ..సంప్రదాయాలను తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. ఇది హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తోందన్నారు. వైవీ సుబ్బారెడ్డి నిర్ణయం అన్యమతస్థులు ఎవరైనా కొండమీదికి వచ్చి, ఏమైనా చేసుకోవచ్చు అన్నట్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details