కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం వేములపల్లిలో మాజీ మంత్రి దేవినేని ఉమ, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పర్యటించారు. వర్షాలకు పాడైపోయిన మిరప పంటను పరిశీలించారు.
వారు మాట్లాడుతూ.. పొలాలకు మీటర్లు బిగించే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుబాబుల్ రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడుతుంటే.. సన్మానాలు, శాలువాలు కప్పించుకుంటున్న ఎమ్మెల్యేలు ఎక్కడున్నారని ప్రశ్నించారు. గతేడాది, ఈ సంవత్సరం పంట నష్టం పరిహారాన్ని వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నారు.