బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి చేసే ప్రసంగంలో గవర్నర్ కొన్ని అంశాలు ప్రస్తావించరాదని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విజ్ఞప్తి చేశారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఉన్న అమరావతి తరలింపు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రభుత్వం అమలు చేస్తోన్న పలు పాలసీలను ప్రస్తావించవద్దని గవర్నర్‌ను కోరారు. ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా గవర్నర్ తన ప్రసంగ అంశాల్లో మార్పులు చేసుకుంటారని ఆశిస్తున్నట్లు యనమల ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు 15రోజులు తక్కువ లేకుండా నిర్వహించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభావం, ప్రభుత్వ కార్యాలయాల తరలింపు, ఎన్నికల కమిషనర్‌కు బెదిరింపులు, మండలి రద్దు, బీసీ రిజర్వేషన్లు కుదింపు, సంక్షేమ పథకాల రద్దు వంటి అంశాలపై సమగ్ర చర్చ జరగాలని యనమల స్పష్టం చేశారు.
బడ్జెట్ ప్రసంగంలో ప్రజా వ్యతిరేక అంశాలు వద్దని గవర్నర్‌కు యనమల వినతి
బడ్జెట్ సమావేశాల్లో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఉండే పలు అంశాలను తన ప్రసంగంలో ప్రస్తావించవద్దని శాసన మండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు కోరారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గవర్నర్ తన ప్రసంగ అంశాల్లో మార్పులు చేసుకుంటారని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఈ ఏడాది 15 రోజులు తక్కువ లేకుండా సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ప్రజా వ్యతిరేక అంశాలు ప్రస్తావించవద్దని గవర్నర్‌కు యనమల వినతి