ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఫల్యాలు కప్పి పుచ్చుకునేందుకే.. కేసుల పేరుతో వేధింపులు : ప్రత్తిపాటి - వైకాపా పాలనపై ప్రత్తిపాటి పుల్లారావు మండిపాటు

ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే తెదేపా నేతలను కేసుల పేరుతో వేధిస్తున్నారని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకరరెడ్డి, చింతమనేని ప్రభాకర్ అరెస్టులను ఆయన ఖండించారు.

tdp leader prathipati pullarao fires on ysrcp government
వైకాపా పాలనపై మండిపడ్డ ప్రత్తిపాటి పుల్లారావు

By

Published : Jun 16, 2020, 1:43 PM IST

Updated : Jun 16, 2020, 3:31 PM IST

వైకాపా పాలనపై మండిపడ్డ ప్రత్తిపాటి పుల్లారావు

రాష్ట్రంలో అక్రమ అరెస్టులు, నిర్బంధాలు పెరిగాయని తెదేపా నేత ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. టెర్రరిస్టుల మాదిరిగా తెదేపా నేతలను అరెస్టు చేస్తున్నారని, ప్రజలు 151 సీట్లు ఇచ్చింది రాజకీయ కక్ష సాధింపు కోసమా అని ప్రశ్నించారు. వైకాపాకు అలవాటైన అవినీతిని తెదేపాకు అంటగడతారా అని ప్రశ్నించారు.

ఇది ట్రైలర్ మాత్రమే అని మంత్రులు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. తెదేపా నేతలను కేసుల పేరుతో భయపెట్టి లొంగదీసుకుంటున్నారని... వైకాపాలో చేరితే సాయంత్రానికి కేసులు ఎత్తివేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి పాలనను ప్రజలు ఎప్పుడూ చూడలేదని తెలిపారు. సంక్రాంతి కానుక, రంజాన్ తోఫాపై సీబీఐ విచారణ జరిపించుకోవచ్చని... తప్పు చేయనపుడు భయపడేది లేదని స్పష్టం చేశారు.

అచ్చెన్నాయుడు పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు దుర్మార్గం. జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిపై అనేక కేసులు పెట్టారు. ఈ అరెస్టులు మీరు ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. కారు దిగకుండానే చింతమనేనిపై కేసు పెట్టారు. పెళ్లికి వెళ్లారని చినరాజప్పపై కేసు పెట్టారు. మీరు ప్రతిపక్షంలోకి వెళ్లాక ఇవన్నీ మీకు కూడా వర్తిస్తాయి. మీరు పెట్టేవి అక్రమ కేసులని,కక్ష సాధింపు, రాజకీయ వేధింపులని ప్రజలకు అర్థమైంది.అధికారం ఒక్కరికే శాశ్వతం కాదు.

-ప్రత్తిపాటి పుల్లారావు, తెదేపా నేత

-

ఇదీ చదవండి:

2 రోజుల సమావేశాలు.. సొంత అజెండా అమలుకే: తెదేపా

Last Updated : Jun 16, 2020, 3:31 PM IST

ABOUT THE AUTHOR

...view details