ప్రజల పక్షాన తెదేపా అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ప్రభుత్వం బీసీ నేతలను తప్పుడు కేసుల్లో ఇరికిస్తోందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి తొత్తుగా మారిందని కొల్లు రవీంద్ర కేసేచెబుతోందని ఆయన మండిపడ్డారు. హతుడు భాస్కర్ రావుపై దాదాపు 90 కేసులున్నాయని.. అటువంటి వ్యక్తి హత్యకు గురైతే, వైకాపా ప్రభుత్వం అతడిని పోరాటయోధుడిగా చిత్రీకరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'మోకా భాస్కరరావుని పోరాట యోధుడిగా చిత్రీకరిస్తున్నారు' - కొల్లు రవీంద్ర కేసు తాజా వార్తలు
దాదాపు 90 కేసుల్లో నిందితుడిగా ఉన్న మోకా భాస్కర్ రావు హత్యకు గురైతే.. అతన్ని వైకాపా ప్రభుత్వం పోరాటయోధుడిగా చిత్రీకరిస్తోందని తెదేపా నేత పట్టాభిరామ్ విమర్శించారు. తప్పుడు ఆధారాలతో మాజీ మంత్రి రవీంద్రను ఈ హత్య కేసులో ఇరికించారని ఆరోపించారు.
tdp pattabhi ram
తప్పుడు ఆధారాలతో మాజీ మంత్రి రవీంద్రను కేసులో ఎలా ఇరికించారో పోలీసులు, ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. జూన్ 29 రాత్రి నిందితులు లొంగిపోతే.. జులై 2న వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు రికార్డుల్లో చూపడమేంటని ప్రశ్నించారు. ధర్మం అంతా తాడేపల్లి ప్యాలెస్‌కు, డీజీపీ కార్యాలయానికి మధ్యనే నడుస్తోందనడానికి ఈ ఆధారాలు చాలన్నారు. భాస్కరరావుపై కక్ష తీర్చుకోవాలన్న ఆలోచన రవీంద్రకు ఉంటే, మంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు వదిలేసేవారని ప్రశ్నించారు.