బాక్సైట్ తవ్వకాలపై తెదేపా ప్రభుత్వం రద్దు చేసిన అనుమతులను..మళ్లీ రద్దు చేయడమేంటనితెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఎద్దేవా చేశారు. 'అదేదో సినిమాలో జరగాలి పెళ్లి మళ్లీ మళ్లీ అన్న రీతిలో జగన్ పాలన ఉందని'ట్వీట్ చేశారు.గిరిజనుల మనోభావాలకు విరుద్దంగా రస్ ఆల్ ఖైమా సంస్థకు బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ దివంగత సీఎం వైఎస్ ఇచ్చిన అనుమతులను,చంద్రబాబు ప్రభుత్వం2014లోనే రద్దు చేసిందని ఆయన చెప్పారు.ఇప్పుడు కొత్తగా బాక్సైట్ తవ్వకాల ఆదేశాలను రద్దు చేస్తున్నామంటూ నాటకం ఆడడం,సాక్షిలో రాతలు చూస్తుంటే..సిగ్గు కూడా సిగ్గు పడే రీతిలో ఉందని లోకేశ్ ఎద్దేవా చేశారు.
'కొత్తగా ప్రయత్నించండి..లేకపోతే కామెడీ పీస్ అవుతారు' - lokesh comments on boxite mining
తెదేపా ప్రభుత్వం రద్దు చేసిన బాక్సైట్ తవ్వకాల ఆదేశాలను..మళ్లీ రద్దు చేయడమేంటని, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆక్షేపించారు. ప్రజలకు కొత్తగా ఏమైనా చేయాలని హితవు పలికారు. లేకపోతే ప్రజల్లో కామెడీ పీస్లాగా మిగిలిపోతారంటూ..ట్వీట్ చేశారు.
లోకేశ్ ట్వీట్