ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇకనైనా రైతుల బాధలు పట్టించుకోవాలి: దేవినేని - దేవినేని ఉమా తాజా వార్తలు

రాష్ట్రంలో రైతులు ఇంత గడ్డు పరిస్థితిలో ఉంటే.. అంతా బాగుందని ప్రభుత్వం ఎలా చెబుతుందని తెదేపా నేత దేవినేని ఉమా నిలదీశారు. నివర్ తుపాన్‌ ప్రభావంతో కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసరలో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. రైతు భరోసా కేంద్రాల్లో రైతు గోడు వినేవారే లేరని వాపోయారు. 18న జరిగే మంత్రి మండలి సమావేశంలో రైతులు చెప్పే బాధలు వినాలని ఆయన కోరారు.

tdp leader devineni uma inspected damaged crops due to nivar affect in krishna district
మంత్రి మండలి సమావేశంలో రైతులు చెప్పే బాధలు వినాలి: దేవినేని

By

Published : Dec 14, 2020, 3:03 PM IST

నివర్ తుపాను కారణంగా కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామంలో జరిగిన పంట నష్టాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమా పరిశీలించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటడం లేదని దేవినేని ఉమా దుయ్యబట్టారు. ఈ నెల 18న జరిగే మంత్రి మండలి సమావేశంలో రైతులు చెప్పే బాధలు వినాలని ఆయన కోరారు. సుమారు 8 లక్షల రేషన్ కార్డుల తొలగింపునకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందని ఆరోపించారు.

ధాన్యం కొనే దిక్కు లేక రైతులు దళారులకు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు తీవ్ర గడ్డు పరిస్థితుల్లో ఉంటే అంతా బాగుందని ప్రభుత్వం ఎలా చెబుతుందని దేవినేని నిలదీశారు.

ABOUT THE AUTHOR

...view details