ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వినూత్న ఆలోచనలతో శభాష్‌ అనిపించుకుంటున్న విద్యార్థులు

ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఏ మాత్రం తీసిపోకుండా గట్టి పోటీనిస్తూ రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు ఈ విద్యార్థులు. కృష్ణా జిల్లా తలగడదీవి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి సైన్స్ కాంగ్రెస్​కు ఎంపికయ్యారు. తమ విద్యార్థులు ఇలా రాష్ట్ర స్థాయిలో రాణించడం ఇది మూడోసారి అని ఉపాధ్యాయులు తెలిపారు.

బహుమతులతో విద్యార్థులు

By

Published : Nov 9, 2019, 10:02 AM IST

రాష్ట్ర స్థాయిలో రాణిస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

కృష్ణాజిల్లా నాగాయలంక మండలం తలగడదీవి గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్ధులు రూపొందించిన ప్రాజెక్టు రాష్ట్ర స్థాయి సైన్స్ కాంగ్రెస్​కు ఎంపికైంది. ఈ నెల 2న విజయవాడలోని ప్రాంతీయ విజ్ఞాన కేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో 9వ తరగతి చదువుతున్న బండిరెడ్డి యశశ్రీ, మాధవి, కొరివి సునందిని, సువర్ణ రూపొందించిన ''మట్టి లేకుండా వ్యవసాయం '' ప్రాజెక్ట్​లో సత్తా చాటి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. జిల్లా స్థాయిలో అన్ని పాఠశాల నుంచి సుమారు 316 ప్రాజెక్ట్​లు రాగా... వీరు చేసిన ప్రాజెక్ట్ రాష్ట్ర స్థాయిలో ఎంపికైంది. ఇదే బడిలో 9వ తరగతి చదువుతున్న బండిరెడ్డి ఇందుజ, బర్మా నాగ పూజిత చేసిన '' ఎరువుల కాలుష్యానికి సహజ పరిష్కారం '' ప్రాజెక్ట్​కు జిల్లా స్థాయిలో బహుమతి లభించింది.
వివిధ రంగాల్లో రాణిస్తూ...
మూడేళ్లుగా తమ పాఠశాల విద్యార్థులు జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్​కు ఎంపికై... రాష్ట్ర స్థాయిలోనూ అవార్డులు సాధించినట్లు ఉపాధ్యాయుడు ఉదయ్ కుమార్ తెలిపారు. గత నెలలో జపాన్​లో జరిగిన ప్రపంచ సునామీ సదస్సులోనూ విద్యార్ధులు పాల్గొని సత్తా చాటారన్నారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న విద్యార్థులను వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందిస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details