సివిల్స్ సాధనే లక్ష్యంగా విద్యాభ్యాసం సాగించాలనుకుంటున్న వారి కోసం తక్షశిలఐఏఎస్ అకాడమీ నేతృత్వంలో.. కోటి రూపాయలకు మించి ఉపకారవేతనాలు ఇవ్వనున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి.ఎస్.ఎస్.దుర్గాప్రసాద్, అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ ఎస్.నాగేశ్వరరావు తెలిపారు. విజయవాడలోని అకాడమీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. తమ సంస్థ ప్రారంభించిన నాలుగేళ్లలో 7 ర్యాంకులు సాధించామనీ.. సామాజిక సేవా దృక్పథంతో ఉపకార వేతనాల ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈనెల 22న విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్ కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష జరగనుందనీ.. పదోతరగతి మొదటి శ్రేణిలో ఉత్తీర్ణత సాధించినవారు దీనికి అర్హులని వివరించారు. ఈ నెల 19లోపు తమ పేర్లను తక్షశిల IAS.com వైబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలనీ.. రాత పరీక్షతోపాటు ఇంటర్వ్యూ నిర్వహిస్తామని వెల్లడించారు.
సివిల్స్ విద్యార్థులకు 'తక్షశిల' ఉపకార వేతనం
సివిల్స్ సాధనే లక్ష్యంగా విద్యాభ్యాసం సాగించాలనుకుంటున్న వారి కోసం తక్షశిల ఐఏఎస్ అకాడమీ నేతృత్వంలో.. కోటి రూపాయలకు మించి ఉపకారవేతనాలు ఇవ్వనున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి.ఎస్.ఎస్.దుర్గాప్రసాద్ తెలిపారు. ఈనెల 22న ప్రవేశ పరీక్ష జరిపి విద్యార్థులను ఎంపిక చేస్తామన్నారు.
సివిల్స్ విద్యార్థులకు 'తక్షశిల' ఉపకార వేతనం