కృష్ణా జిల్లాపై కన్నెర్ర చేసిన భాస్కరుడు - DISTRICT
అధిక ఉష్ణోగ్రతలతో విజయవాడ వాసులను భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. రెండు రోజులుగా 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలతో భాస్కరుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. రానున్న రెండు నెలలు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు... ప్రజలను మరింత భయపెడుతున్నాయి.
రెండు రోజులుగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 40 నుండి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలతో బెజవాడ నిప్పుల కొలిమిలా మారింది. ఏప్రిల్ నెలలోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఎండలు ఎలా ఉంటాయో అని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల చివరన 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని.. మే నెలలో గరిష్ఠంగా 43 నుండి 46 డిగ్రీల వరకు పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వేడిగాలులు భయపెడుతున్నా నిత్యావసరాలకు బయటకు రాక తప్పడం లేదని నగర వాసులు చెబుతున్నారు.