కృష్ణా జిల్లా మొవ్వ మండలం పెదముత్తేవి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చల్లపల్లి వివేకానంద డిగ్రీ కాలేజ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని భవాని మృతి చెందింది. కళాశాలకు బైక్పై వెళ్తున్న ఆమె... ట్రాక్టర్ను క్రాస్ చేసే క్రమంలో వాహనం తగిలి ప్రమాదం జరిగింది. అక్కడికక్కడే భవాని చనిపోగా... మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి కూచిపూడి పోలీసులు తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాక్టర్ తగిలి ద్విచక్రవాహనంపై వెళ్తున్న విద్యార్థిని మృతి - కృష్ణా తాజా సమాచారం
కృష్ణా జిల్లా మొవ్వ మండలం పెదముత్తేవి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థిని మృతి చెందింది. ద్విచక్రవాహనంపై కాలేజీకి వెళ్తుండగా.. ట్రాక్టర్ తగిలి ఆమె మరణించింది.
ట్రాక్టర్ తగిలి ద్విచక్రవాహనంపై వెళ్తున్న విద్యార్థి మృతి