స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోకు అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇసుక, మద్యం అక్రమాల నియంత్రణకు... ప్రభుత్వం ఎస్‌ఈబీని ఏర్పాటు చేసింది. ఎస్‌ఈబీ ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా డీజీపీని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోకు అధికారుల నియామకం - స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోకు అధికారుల నియామకం వార్తలు
స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోకు అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్‌ఈబీ ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా డీజీపీని నియమిస్తూ ఆదేశాలిచ్చింది.
ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్ లాల్‌ను ఎస్‌ఈబీ కమిషనర్‌గా బదిలీ చేసినట్లు ఆదేశాల్లో పేర్కొంది. అరిఫ్ హాఫిజ్‌ను గుంటూరు గ్రామీణ ఎస్‌ఈబీ అదనపు సూపరింటెండెంట్‌గా బదిలీ చేశారు. గరుడ్ సుమిత్ సునీల్‌ను తూర్పుగోదావరి జిల్లా ఎస్ఈబీ ఏఎస్పీగా... రాహుల్ దేవ్ సింగ్‌ను విశాఖ గ్రామీణ ఎస్‌ఈబీ ఏఎస్పీగా... అనిత వెజెండ్లను విశాఖపట్నం నగర ఎస్‌ఈబీ ఏఎస్పీగా ... గౌతమి సాలిని కర్నూలు జిల్లా ఎస్‌ఈబీ ఏఎఎస్పీగా... వకుల్ జిందాల్‌ను కృష్ణా జిల్లా ఎస్ఈబీ ఏఎస్పీగా... రిశాంత్‌రెడ్డిని చిత్తూరు జిల్లా ఎస్‌ఈబీ ఏఎఎస్పీగా బదిలీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వ ఆదేశాల్లో పేర్కొంది.