'పఢ్ నా లిఖ్ నా' అభియాన్ కార్యక్రమాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ప్రాంగణంలోని వయోజన విద్యా శాఖ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వయోజన విద్య శాతం పెంచే కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని ఆయన అన్నారు. సీఎం జగన్ చిత్తశుద్ధితో విద్యాభివృద్ధి కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యకు అధిక ప్రాముఖ్యతను ఇచ్చేందుకు నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్యా శాఖకు సంబంధించిన సహాయ సంచాలకులు.. పాల్గొన్నారు.
రాష్ట్ర బడ్జెట్లో విద్యకు అధిక ప్రాధాన్యం: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి - Minister Adimulapu Suresh latest news
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో 'పఢ్ నా లిఖ్ నా' అభియాన్ కార్యక్రమాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రారంభించారు. రాష్ట్రంలో అక్షరాస్యత 100 శాతానికి చేరుకునేందకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్