విజయవాడలో అజిత్‌సింగ్‌నగర్ రాజరాజేశ్వరిపేటలోని ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. వంట గదిలోని రైస్ కుక్కర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లోనివారు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. రైస్ కుక్కర్‌తోపాటు, ఫ్రిజ్, ఇతర గృహోపకరణాలు మంటల్లో బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది..సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం..గృహోపకరణాలు దగ్ధం - విజయవాడ తాజా వార్తలు
ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలు గృహోపకరణాలు దగ్ధమయ్యాయి.
షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం