SEC: హైకోర్టు ఉత్తర్వులతో ఎన్నికల ఫలితాలపై ఎస్ఈసీ కసరత్తు
13:54 September 16
SEC exercise on election results in the wake of High Court orders
హైకోర్టు ఉత్తర్వులు నేపథ్యంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌పై రాష్ట్ర ఎన్నికల కమిషన్( ఎస్ఈసీ) కసరత్తు ప్రారంభించింది. తీర్పు కాపీని పరిశీలించిన అనంతరం కౌంటింగ్ తేదీలపై నిర్ణయం తీసుకోవాని భావిస్తున్నట్ల తెలిసింది. దీనిపై సీఎస్, డీజీపీలతో సమావేశం కానున్న ఎస్ఈసీ.. కౌంటింగ్ తేదీలను ఖరారు చేయనున్నట్టు సమాచారం.
జెడ్పీడీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ 1న ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 8 తేదీన ఎన్నికలను నిర్వహించారు. 10,047 ఎంపీటీసీ స్థానాల్లో 2,371 ఏకగ్రీవం అయ్యాయి. మొత్తం 660 జెడ్పీటీసీ స్థానాలకు గానూ.. 126 ఏకగ్రీవం అయ్యాయి. హైకోర్టు ఆదేశాలతో కౌంటింగ్‌కు సంబంధించిన తేదీని ఎస్ఈసీ త్వరలో ఖరారు చేయనుంది.
ఇదీ చదవండి: CM Jagan: పెన్షన్ల విషయంలో ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి: సీఎం జగన్