సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందిరపైనా ఉందని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్టణంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో కలెక్టర్‌తో పాటు జేసీ కె.మాధవీలత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సంబరాల్లో భాగంగా గంగిరెద్దుల ప్రదర్శన, రంగవల్లుల పోటీలు, బొమ్మల కొలువులు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
మచిలీపట్టణంలో సంక్రాంతి సంబరాలు - makara sankranti
కృష్ణా జిల్లాలో ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, ఇతర అధికారులు వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో పండుగ చేసుకోవాలని ఆకాంక్షించారు.
మచిలీపట్టణంలో సంక్రాంతి సంబరాలు