కృష్ణా జిల్లా అవనిగడ్డ ఏరియా ఆస్పత్రిలో వికలాంగులకు సదరన్ క్యాంపును... ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రారంభించారు. ఇక్కడ సదరం క్యాంపు నిర్వహించడం దివిసీమ ప్రజలకు మంచి అవకాశమని ఆయన తెలిపారు. సదరం సర్టిఫికెట్ కోసం ఇప్పుడు మచిలీపట్నం జిల్లా వైద్యశాలకు వెళ్లవలసిన అవసరం లేదని తెలిపారు. కంటి చూపు, ఎముకలకు సంబంధించిన అంగవైకల్యం కలిగిన దివ్యాంగులకు ప్రతి మంగళవారం, అనుభవం కలిగిన ముగ్గురు వైద్యుల బృందం చేత నిర్ణయించి, ధ్రృువపత్రాలు ఇస్తామని వైద్యశాల సూపరింటెండెంట్ తెలిపారు. వికలాంగ ధ్రువీకరణ పత్రం కోసం ముందుగా మీ సేవలో దరఖాస్తు చేసుకుని, డాక్టర్ చెకప్ తేదీని నిర్ధరించి, తప్పనిసరిగా అదే రోజు సంబంధిత వైద్యుని వద్ద పరీక్షలు చేయించుకోవాలని అన్నారు.
కృష్ణా జిల్లాలో వికలాంగులకు సదరం క్యాంపు ప్రారంభం - వికలాంగులకు సదరం క్యాంపు వార్తలు
కృష్ణా జిల్లా అవనిగడ్డ ఏరియా ఆసుపత్రిలో వికలాంగులకు సదరం క్యాంపును...ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రారంభించారు. సదరం సర్టిఫికెట్ కోసం ఇప్పుడు మచిలీపట్నం జిల్లా వైద్యశాలకు వెళ్లవలసిన అవసరం లేదని తెలిపారు. అనుభవజ్ఞులైన వైద్యులతో పరీక్షలు నిర్వహించి ధ్రువపత్రాలు అందిస్తామని స్పష్టం చేశారు.
కృష్ణా జిల్లాలో వికలాంగులకు సదరం క్యాంపు