ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సంక్షేమ నిధులతో ఉపాధి కోల్పోయిన కార్మికులను ఆదుకోండి'

నూతన ఇసుక విధానం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ... విజయవాడలో టీఎన్​టీయూసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలతో అఖిలపక్షం సమావేశం నిర్వహించింది. పాత ఇసుక విధానాన్నే అమలు చేయాలని డిమాండ్ చేసింది.

జయవాడలో టీఎన్​టీయూసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలతో అఖిలపక్షం సమావేశం
జయవాడలో టీఎన్​టీయూసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలతో అఖిలపక్షం సమావేశం

By

Published : Mar 28, 2021, 8:55 PM IST


నూతన ఇసుక విధానంపై విజయవాడలో టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని.. గతంలో ఉన్న ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలని టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి మళ్లించిన నిధులను తక్షణమే జమ చేయాలని కోరారు. ఇసుక కొరతతో ఉపాధి కోల్పోయిన కార్మికులకు నెలకు 5వేల రూపాయలు ఇవ్వాలన్నారు.

ఇసుకను అధిక ధరలకు విక్రయించడాన్ని అన్ని కార్మిక సంఘాలతో రాష్ట్రస్థాయి ఉద్యమం చేపడతామన్నారు. సంక్షేమ బోర్డు నిధులతో ఉపాధి కోల్పోయిన కార్మికులను ఆదుకోవాలని ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి తాతయ్య డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి

చెత్తకు నిప్పంటించిన ఆకతాయిలు.. మంటలను అదుపుచేసిన సిబ్బంది

ABOUT THE AUTHOR

...view details