విజయవాడ బస్టాండ్, రైల్వే స్టేషన్లో అమయాకపు ప్రయాణికులను అడ్డంగా మోసంచేస్తున్నారు ఓ నకిలీ బంగారం అమ్మే ముఠా. ఈ క్రమంలోనే రమేష్ అనే వ్యక్తికి 4వేల 500రూపాయిలకు బంగారు గుండ్లు అని చెప్పి ముగ్గురు దుండగులు విక్రయించారు. వాటిని షాపులో పరిశీలించగా అసలు విషయం తెలిసింది. వెంటనే రమేష్ పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి 2కిలోల నకిలీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మూడో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
బంగారం అంటూ మోసం... బయటపడింది వీళ్ల వేషం...
బంగారం అన్నారు...అమ్ముతానన్నాడు..నమ్మి విక్రయించిన తరువాత తెలిసింది అసలు విషయం... మోసపోయనని... కృష్ణాజిల్లా విజయవాడలో కొందరు దొంగలు.... బంగారం తక్కువ ధరకు వస్తుందని చెప్పి నకిలీ బంగారాన్ని అమాయకపు ప్రయాణికులకు అమ్ముతున్నారు.
నకిలీ బంగారాన్ని విక్రయించిన దొంగలు