నందిగామలో 25వ రోజుకు రిలే దీక్షలు
అమరావతి రాజధానిగా ఉండాలని కోరుతూ కృష్ణాజిల్లా నందిగామలో ఐకాస ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 25వ రోజుకు చేరుకున్నాయి. మూడు రాజధానుల వల్ల ఏ ప్రాంతానికీ లాభం ఉండదని.. పైగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని ఐకాస నాయకులు పేర్కొన్నారు. అమరావతి ఒక బ్రాండ్‌గా ఉందని దాన్ని చెడగొట్టడానికి ముఖ్యమంత్రి అనేక కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. సీఎం జగన్ మూడు రాజధానుల ఆలోచన విరమించుకోవాలన్నారు.
నందిగామలో రిలే దీక్షలు
.
TAGGED:
నందిగామలో అమరావతి దీక్షలు