కరోనా వ్యాధి ప్రబలుతోన్న దృష్ట్యా శ్వాస కోశ సంబంధిత సమస్యలతో బాధపడే వారు చాలా జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాధినిరోధక శక్తి తగ్గకుండా విటమిన్లు కలిగి సమతుల ఆహారం తీసుకోవటం, తగిన వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. కరోనా బారిన పడినా లేదా..వైరస్ సోకిందని అనుమానం ఉన్నవారు తప్పనిసరిగా ఎన్95 మాస్కులు ధరించాలని ప్రముఖ శ్వాస కోశ వైద్య నిపుణులు డాక్టర్ గోపాల కృష్ణ తెలిపారు. మాస్కు రకాన్ని బట్టి నిర్ణీత కాలం మేరకు మాత్రమే వినియోగించాలనీ, లేని పక్షంలో మాస్కుల వల్ల వైరస్ ప్రబలే ప్రమాదం ఉంటుందన్నారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను వైద్యుల సిఫార్సు లేకుండా ఇతరులు వాడటం అత్యంత ప్రమాదకరమని భారత్ ముఖాముఖిలో వివరించారు.
'కరోనా దృష్ట్యా వారు అప్రమత్తంగా ఉండాలి' - respiratory patients care to avoide corona
కరోనా కమ్ముకొస్తున్న నేపథ్యంలో శ్వాస కోశ సంబంధిత రోగులు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మాస్కుల వాడక విషయంలో జాగ్రత్తలు పాటించాలని వివరిస్తున్నారు.
డాక్టర్ గోపాల కృష్ణతో ఈటీవీ భారత్ ముఖాముఖి