ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 20, 2020, 4:15 PM IST

ETV Bharat / state

విజయవాడలో రేషన్ డీలర్ల ధర్నా

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్లు మెరుపు సమ్మెకు దిగారు. విజయవాడలో రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు ఆధ్వర్యంలో డీలర్లు నిరసన చేశారు. బకాయిలు చెల్లించి తమకు బీమా సౌకర్యం కల్పించే వరకూ విధులకు హాజరుకాబోమని స్పష్టం చేశారు.

ration delears protest in vijayawada about pending commission
ration delears protest in vijayawada about pending commission

కరోనా కష్ట కాలంలో పేదలకు రేషన్ ఏడు విడతలుగా పంపిణీ చేస్తే.. రెండు‌ విడతలకు మాత్రమే కమిషన్ ఇచ్చారని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మండాది వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎనిమిదో విడత పంపిణీకి ఏర్పాట్లు పూర్తవటంతో బకాయిలు చెల్లిస్తేనే విధులకు హాజరవుతామని డీలర్లు విజయవాడలో ధర్నా నిర్వహించారు.

ఆరుగురు రేషన్ డీలర్లు కరోనాతో మరణిస్తే కనీసం ప్రభుత్వం స్పందించ లేదని...ఒక్కో వితడతలో కోటిన్నర మంది చొప్పున నెలలో మూడు కోట్ల మందికి రేషన్ ఇచ్చామన్నారు. కరోనా రక్షణ పరికరాలు ఇవ్వకున్నా.. బాధ్యతతో పని చేశామన్నారు.

తమకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రేషన్ ఇచ్చే సమయంలో వేలి ముద్రల నిబంధన ఎత్తి వేయాలని...గుజరాత్ లో 25లక్షలు ఇన్సూరెన్స్ ఇవ్వగా, ఒడిశాలో వేలి ముద్రలు ఎత్తివేశారన్నారు. తమ సమస్యలపై అధికారులను కలిసి విన్నవిస్తే.. అవమానించేలా మాట్లాడారన్నారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించి న్యాయం చేసే వరకు విధులకు హాజరుకాబోమని రేషన్ డీలర్లు స్పష్టం చేశారు. న్యాయం జరగకపోతే ఆమరణ దీక్షలకు సిద్దంగా ఉన్నామన్నారు.

ఇదీ చూడండి

'కోర్టులు 'అవసరం' అయినప్పుడే జోక్యం చేసుకుంటాయి''

ABOUT THE AUTHOR

...view details