రామన్నపేట బల్లకట్టు వద్ద ఉద్రిక్తత
కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం రామన్నపేట బల్లకట్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం జరిగిన ప్రమాదంలో బల్లకట్టును బయటకు తీసే విషయంలో ఆందోళన నెలకొంది.
గ్రామస్థుల ఆందోళన
మంగళవారం జరిగిన ప్రమాదంలో బల్లకట్టును బయటకు తీసే విషయంలో ఆందోళన నెలకొంది. క్రేన్ తో తీయటానికి నిర్వాహకులు వచ్చారు. గ్రామస్థులు అక్కడకు చేరుకుని వాగ్వాదానికి దిగారు. నిర్వాహకులు కొందరు స్థానికులపై చేయి చేసుకున్నారు. క్షమాపణ చెప్పాలంటూ గ్రామస్థులు డిమాండ్ చేశారు.