Ramamohana Rao Cremation: రామోజీ ఫిల్మ్‌సిటీ మాజీ ఎండీ రామమోహనరావు అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో జరిగిన అంత్యక్రియల్లో ఈనాడు గ్రూపు సంస్థల ఉన్నతోద్యోగులు, సిబ్బంది.. బంధువులు, శ్రేయోభిలాషులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ఉదయం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో రామమోహనరావు భౌతిక కాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.
ముగిసిన అట్లూరి రామమోహనరావు అంత్యక్రియలు
Ramamohana Rao Cremation: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో రామోజీ ఫిల్మ్‌సిటీ మాజీ ఎండీ రామమోహనరావు అంత్యక్రియలు ముగిశాయి. రామమోహనరావు భౌతికకాయానికి ప్రముఖులు కడసారి నివాళులు అర్పించారు. అనంతరం రామమోహనరావు నివాసం నుంచి మహా ప్రస్థానం వరకు జరిగిన అంతిమయాత్రలో బంధువులు, శ్రేయోభిలాషులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
రామమోహనరావు
భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల.. రామమోహనరావు భౌతికకాయానికి నివాళులర్పించారు. మాజీ ఎంపీ సుజనా చౌదరి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బొల్లినేని కృష్ణయ్య, నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్ తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం రామమోహనరావు నివాసం నుంచి మహా ప్రస్థానం వరకు జరిగిన అంతిమయాత్రలో బంధువులు, శ్రేయోభిలాషులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
ఇవీ చదవండి: